రేషన్ కార్డులలో బయోమెట్రిక్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సభ్యుడు ఉండే రేషన్ కార్డుదారులకు ఒక వేళ వారి బయోమెట్రిక్ పడకపోతే మాత్రమే వాలంటీర్ ల బయోమెట్రిక్ తో సరుకులు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.
ఇక రేషన్ కార్డులో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే ఒకరి బయోమెట్రిక్ రాకపోతే మరొకరి బయోమెట్రిక్ ను ఉపయోగించి సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ విధానంలో కొన్ని సార్లు వేలిముద్రలు పడకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఒకే సభ్యుడు ఉండి వేలు ముద్ర పడకపోతే సరుకులను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.