తెలంగాణ లో అమిత్ షా పర్యటన..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ లో పర్యటించ బోతున్నట్టు బిజేపి వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రం లో పర్యటిస్తార ని తెలుస్తోంది. అంతే కాకుండా అమిత్ షా నిర్మల్ లో భారీ భహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. నిర్మల్ లో రజాకార్లకు వ్యతిరేఖంగా పోరాడి 1000మందికి పైగా ప్రాణాలు వదిలారు.

ఈ నేపథ్యంలో అమిత్ షా అక్కడే సభను ఏర్పాటు చేసే అలోచలనలో ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ పై బీజేపీ మరింత ఫోకస్ పెంచింది. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా ఆశీర్వాద యాత్రను చేపట్టగా…. బండి సంజయ్ కూడా పాద యాత్ర చేశారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి సైతం పర్యటన కు సిద్ధం అవుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం లో కాషాయ జెండా ఎగురవేయడమే బీజేపీ లక్ష్యం గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.