తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారి ఈరోజు ఉదయం ఎనిమిదిన్నరకు ఉత్తర కోస్తా ఒడిస్సా దగ్గర చాంద్ బలీకి పశ్చిమ వాయువ్యదిశగా 20కి.మీ.
దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణశాఖ తెలిపింది.దాంతో రాబోయే 48గంటల్లో పశ్చిమ వాయివ్య దిశగా ఉత్తర ఒడిస్సా, ఉత్తర ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ మీదుగా పయనించే అవకాశలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ములుగు, పెద్దపల్లి మంచిర్యాల,కొమురంభీమ్, భూపాల్ పల్లి,జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరబాద్ వాతావరణ శాక వెల్లడించింది.