ఇండియాలో తగ్గుముఖం పట్టిన క‌రోనా : కొత్తగా 25,404 కేసులు

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తునే ఉంది. మొన్నటి వరకు కరోనా కేసులు అదుపులోకి రాగా… ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే… ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 25,404 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,32,89,579 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,62,207 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.66 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 339 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,43,213 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37, 127 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా రికవరీ ల సంఖ్య 3,24,84,159 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 75,22,38,324 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 78,66,950 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.