సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. ఎవడైనా దుర్మార్గాలకు పాల్పడితే ఇలాంటి గతే పడుతుందని సీతక్క అన్నారు. ప్రభుత్వం పట్టించుకోకున్నా ప్రజల తిరుగుబాటుకు…ప్రజల నిరసనలకు భయపడి ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా ఇదో గుణపాఠం కావాలని సీతక్క అన్నారు. ఇది ప్రజా విజయం గా పోరాట విజయం గా భావించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అదే విధంగా రాజు చేసిన తప్పుతో అతడి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆతడి కూతురును మరియు అతడి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సీతక్క ఇదివరకే సింగరేణి కాలనీ కి వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయం లో రాజు ను పోలీసులు వెంటనే పట్టుకుని ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈరోజు అతడే ఆత్మహత్య చేసుకోవడం పై కూడా సీతక్క స్పందించారు.