మీరు మీ పనులు చేసుకుంటూ పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం కొన్ని బిజినెస్ ఐడియాస్. ఈ ఐడియాస్ ని కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మంచి రాబడి పొందొచ్చు. అది కూడా మీ వీలుని బట్టి మీరు మీ సమయంలో కాస్త సమయాన్ని వాటిపై వెచ్చించి సంపాదించొచ్చు. ఇక ఆ ఐడియాస్ గురించి చూస్తే…
చెఫ్:
మీరు బాగా వండుతారా..? అయితే ఇలా డబ్బులని సంపాదించచ్చు. ఈ మధ్యకాలంలో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు ఏదైనా రెస్టారెంట్ లాంటి ప్రదేశాలలో పని చేసి సంపాదించొచ్చు.
పర్సనల్ ట్రైనర్:
అన్ని వయసు వాళ్ళు ఈ రోజుల్లో పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకుంటున్నారు. కనుక మీరు క్లబ్స్, జిమ్స్, స్పా మొదలైన వాటిలో పని చేయొచ్చు.
హోమ్ ఎంటర్టైన్మెంట్ రిపేర్లు:
మీకు రిపేరు చేయడం వచ్చి ఉంటే మీరు ఈ పని చేయొచ్చు. ఇళ్లల్లో వాడే డివిడి ప్లేయర్ వంటి వాటిని రిపేర్ చేసి మీరు సంపాదించవచ్చు. దీంతో మీరు మంచి ఆదాయం పొందొచ్చు.
టీ షర్ట్ డిజైన్:
మీరు టీ షర్ట్ లు మొదలైన వాటిపై పెయింట్స్ వేసి కూడా డబ్బులు సంపాదించ వచ్చు. మీరు కనుక ఆర్టిస్ట్ అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకుని మంచిగా డబ్బులు సంపాదించండి.
కంప్యూటర్ ట్రైనర్:
ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. చాలా మంది కంప్యూటర్ ని నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు కనుక మంచి స్కిల్స్ ఉంటే వాళ్లకి కోచింగ్ ఇచ్చి మంచిగా డబ్బులు సంపాదించండి. ఇలా కూడా నీకు ఉన్న సమయంలో మీరు మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. అది కూడా రోజులో మీకు వీలు అయ్యినప్పుడే.