VIDEO : వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం కోసం బ‌స్సెక్కిన స‌జ్జ‌న్నార్..!

-

గ‌తంలో పోలీస్ శాఖ‌లో ప‌నిచేసిన స‌జ్జ‌న్నార్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు జ‌రిగిన దారుణాల కేసుల్లో ఎన్కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ గా స‌జ్జన్నార్ కు ఎంతో గుర్తింపు వ‌చ్చింది. దాంతో ఇప్ప‌టికీ మ‌హిళ‌లపై దారుణాలు జ‌రిగితే స‌జ్జాన్నార్ నే త‌లుచుకుంటారు. అయితే ప్ర‌స్తుతం స‌జ్జ‌న్నార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా కూడా స‌జ్జ‌న్నార్ త‌న మార్క్ చూపిస్తున్నారు. ఇటీవ‌ల ఎంజీబీఎస్ లో ఆక‌స్మిక త‌నికీలు నిర్వ‌హించి అధికారులకు చెమ‌టలు పట్టించారు.

ఇక తాజాగా ఈరోజు స‌జ్జన్నార్ త‌న కుటుంబంతో క‌లిసి ఆర్టీసీ బ‌స్సులో వినాయ‌కుడి నిమ‌జ్జ‌నానికి వెళ్లి అంద‌ర్నీ ఆక‌ర్షించారు. ఇక దీనికి సంబంధిచిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. స‌జ్జ‌న్నార్ మ‌హ‌రాష్ట్ర లుక్ లో టోపీ పెట్టుకుని క‌నిపిస్తున్నారు. ఇక బ‌స్సులో వెలుతున్న స‌జ్జ‌న్నార్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

https://twitter.com/DonitaJose/status/1439435225059115014?s=20

Read more RELATED
Recommended to you

Latest news