యెల్లో మీడియా కవర్‌డ్రైవ్‌లు…పాపం బాబు….

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు…అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. ఆ మీడియా సంస్థలు తమ తమ పార్టీలకు భజన చేస్తూ, ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేస్తాయి. ఇక నలభై ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా ఉన్న విషయం తెలిసిందే. అసలు రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు అనుకూలంగా పనిచేస్తాయని టి‌డి‌పి ద్వారానే తెలిసింది.

అంటే మొదట నుంచి టి‌డి‌పికి అనుకూలంగా పనిచేసే మీడియా సంస్థలు ఉన్నాయి…ఇక వాటినే యెల్లో మీడియా అని ప్రత్యర్ధులు ముద్దుగా పిలుచుకుంటారు. మరి ఈ యెల్లో మీడియా పని ఏంటంటే…టి‌డి‌పికి పూర్తిగా భజన చేయడం..ప్రత్యర్ధి పార్టీగా ఉన్న వైసీపీపై నిత్యం బురద జల్లడం. టి‌డి‌పి ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ యెల్లో మీడియా….పార్టీని జాకీలు వేసి మరీ పైకి లేపడానికి ప్రయత్నిస్తుంది. ఇటు మన చినబాబు…అదే లోకేష్ బాబుని లీడర్ చేయడానికి చాలా కష్టపడుతుంది.

ఇక జగన్ ప్రజలకు మేలు చేసే పనులు చేసినా సరే…అబ్బే జగన్ వల్ల కొంపలు మునిగిపోతున్నాయనే విధంగా ప్రచారం చేయడం ఆ యెల్లో మీడియా పని. సరే ఈ పనులన్నీ మామూలే అనుకుంటే…తాజాగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాలు విషయంలో కూడా టి‌డి‌పిని కవర్ చేయడానికి యెల్లో మీడియా పడుతున్న తిప్పలని చూస్తుంటే పాపం అనిపిస్తోంది.

ఎందుకంటే అనేక ట్విస్ట్‌ల మధ్య ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలు జరగడం గానీ, ఫలితాలు రావడం గానీ జరుగుతుంది. అయితే గతంలోనే ఈ ఎన్నికలకు టి‌డి‌పి నామినేషన్లు వేసింది. ఇక ఎన్నికల సమయం వచ్చేసరికి…తాము వైసీపీ అరాచాకాలకు  వ్యతిరేకంగా ఎన్నికలని బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. అయినా సరే నామినేషన్లు ముందే వేయడంతో తమ్ముళ్ళు ఎన్నికల్లో బాగానే హడావిడి చేశారు. తీరా ఇప్పుడు ఫలితాల్లో వైసీపీ హవా స్పష్టంగా ఉండటంతో, తమ్ముళ్ళు సైడ్ అయిపోయారు..కుప్పంలో కూడా టి‌డి‌పి తుడుచుకుపెట్టుకుపోయింది.

అందుకే ఈ ఓటమిని కవర్ చేయడానికి టి‌డి‌పి ఎన్నికలని బహిష్కరించిందని యెల్లో మీడియా వరుసపెట్టి వార్తలు వేస్తూనే ఉంది. అంటే ఎంతలా కవర్ చేస్తుందో అర్ధమవుతుంది. అయితే టి‌డి‌పి సీన్ అయిపోయిందని ప్రజలకు ఇప్పటికే అర్ధమైపోయింది…కాబట్టి యెల్లో మీడియా కవర్ డ్రైవ్‌లు వేసుకున్న ఉపయోగం లేదని వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news