తూర్పుగోదావరి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు. సినిమా టిక్కెట్ల విషయం పై సిఎం జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు.. సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించడం మంచిదేనని.. మాజీ సినిమా ఎగ్జిబిటర్ గా మరికొన్ని సూచనలు చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.
సినిమా టిక్కెట్ల తరహా లోనే హీరో, హీరోయిన్ల పారితోషకాలు ఆన్ లైన్ లోనే చెల్లించాలని ముద్రగడ లేఖలో వెల్లడించారు. సినిమాకు చేసే ఖర్చును నిర్మాత నుంచి ప్రభుత్వం ముందుగా బ్యాంక్ లో జమ చేయించుకోవాలని.. ప్రభుత్వం ద్వారానే సినిమా నటులు, టెక్నీషియన్ల బ్యాంక్ అకౌంట్లకు నగదు పంపాలని సూచనలు చేశారు ముద్రగడ. అలాచేస్తే సినిమారంగంలో బ్లాక్ మనీ తగ్గుతుందన్నారు. ప్రముఖ సినీనటుల సూచన తో పాటు తన సూచన కూడా పరిగణించాలని లేఖలో సి.ఎం జగన్ ను కోరారు ముద్రగడ.