శుక్రవారం రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే సమస్యలు దూరం..!

-

శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం అంటే అత్యంత ప్రీతికరమైన రోజు. శుక్రవారం నాడు మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలానే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే శుక్రవారం నాడు ఏ విధంగా పాటిస్తే మంచిది…?, ఏ తప్పులు చేయకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.

 

Goddess Lakshmi Devi | శ్రావ‌ణ మాసం
Goddess Lakshmi Devi | శ్రావ‌ణ మాసం

శుక్రవారం రోజు ఎప్పుడు కూడా మాసిన బట్టలను, ముతక బట్టలను వేసుకోకూడదు. ఇది నిజంగా అరిష్టమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలానే శుక్రవారం నాడు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి మంచి కలగాలంటే రాళ్ల ఉప్పుని కుప్పగా పోసి అందులో దీపం వెలిగించాలి ఇలా శుక్రవారం నాడు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి ఆనందంగా ఉండొచ్చు.

అలాగే ఎవరికి కూడా శుక్రవారం నాడు ఉప్పుని దానమివ్వకూడదు. ఇలా కనుక చేశారంటే మన ఇంట్లో ఉండే మహాలక్ష్మిని మన చేతులతో స్వయంగా పంపించినట్లు అర్థం. అలాగే శుక్రవారం మహిళలు ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేయడం మంచిది. అలాగే శుక్రవారం నాడు రావి చెట్టుని తాకకూడదు రావి ఆకులను తుంచకూడదు. తులసి కోటకు పూజ చేయడం చాలా మంచిది నీళ్లు పోసి తులసి మొక్క కి నమస్కారం చేసుకుని దీపం వెలిగిస్తే చక్కటి ఫలితం కలుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

అదే విధంగా శుక్రవారం నాడు కావాలంటే నగలను కొనుక్కోవచ్చు. శుక్రవారంనాడు మగవారు గడ్డం తీయడం జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు. అలాగే శుక్రవారం నాడు మహిళలు నుదుట బొట్టు లేకుండా ఉండకూడదు. ఇలా శుక్రవారం నాడు ఈ పద్ధతులు పాటించారు అంటే ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news