తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసింది. నిన్న ఉత్తర ఛత్తీస్ ఘడ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఉపరితల అవర్తనము ఈ రోజు దక్షిణ ఛత్తీస్ ఘడ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి మి ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ రోజు ఉపరితల ఆవర్తనం మయన్మార్ తీరం మరియు పరిసర మర్తబన్ గల్ఫ్ ప్రాంతాలలో ఏర్పడి మధ్యస్థ ట్రోపోస్పీరిక్ ఎత్తు వరకు కొనసాగుతుంది.
ఈ అవర్తనము వాయువ్య దిశలో కదిలి ఈశాన్య మరియు పరిసర తూర్పు మధ్య బంగళాఖాతంలో ప్రాంతాలకు చేరుకొని రేపు 24న సాయంత్రంకి అల్పపీడనంగా అదే ప్రదేశంలో ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ అల్పపీడనం తదుపరి 24 గంటలలో ఒడిస్సా తీరంకి చేరుకునే అవకాశం ఉన్నది.ఉపరితల ఆవర్తనం తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ నుండి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతోంది. దీని ప్రభావం తో ఈ రోజు ,రేపు భారీ వర్షములు తెలంగాణా రాష్ట్రంలో ఒకటి, రెండు ప్రదేశములలో భారీ వర్షాలు మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.