Bigg boss 5: హౌస్‌లో అత‌డే గుంట‌ న‌క్క? అస‌లు విష‌యాన్ని బయటపెట్టేసిన లహరి..!

-

Bigg boss 5: బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా కొన‌సాగుతోంది. కావాల్సినంత వినోదాన్ని పంచుతూ.. పుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ షో.. మూడు వారాలు, మూడు ఎలిమినేష‌న్ల పూర్తి చేసుకుని విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. సరయు, ఉమాదేవి, లహరి హౌస్ నుంచి ఎలిమినేట్
హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. తాజాగా నాలుగోవారం నామినేష‌న్ కూడా చాలా ఉత్కంఠగా జ‌రిగింది. ఈ నామినేష‌న్లో లోబో, నటరాజ్, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, అనీలు నిలిచారు.


ఇదిలాఉంటే.. గ‌తంలో హౌస్‌లో ఓ గుంట న‌క్క ఉన్న‌దనీ? వాళ్లే గేమ్ ని డిసైడ్ చేస్తున్నారు అని నట‌రాజ్ మాస్ట‌ర్ సంచ‌ల‌న వ్యాక్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.. అయితే.. ఆ గుంట నక్క ఎవరనేది తెలుసుకోవ‌డం కోసం బిగ్ బాస్ ల‌వ‌ర్స్ చాలా ఉత్కంఠ‌గా వేచిచూస్తున్నారు. తాజాగా ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని బ‌య‌ట‌పెట్టేసింది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ లహరి.

మూడో ఎలిమినేషన్‌లో హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లినా అర్జున్ రెడ్డి బ్యూటీ ల‌హ‌రితో అరియానా గ్లోరీ..బిగ్ బాస్ బజ్‌ పేరుతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వ‌హించింది. ఈ సందర్భంలో నటరాజ్ మాస్టర్ చెబుతున్నఆ గుంట నక్క ఎవరు? అని ల‌హ‌రిని ప్ర‌శ్నించగా.. షాకింగ్ స‌మాధానం ఇచ్చింది. అత‌డు ఎవ‌రో కాదు.. యాంక‌ర్ ర‌వినే అని వెల్లడించింది. ఆ విషయంలో హౌస్‌లోని అందరికీ తెలుసని.. కానీ, అందరూ నవ్వుతూ మాట్లాడుతుంటారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

అనంత‌రం మ‌రో ఇంట్రెస్టింగ్ కొష‌న్ అడిగింది. బిగ్ బాస్ సీజ‌న్ 5 టైటిల్ విన్నర్ అయ్యే అవ‌కాశ‌మెవ‌రికి ఉంద‌ని ప్ర‌శ్నించ‌గా.. విశ్వ, శ్వేతా‌లో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ అవుతార‌ని లహరి అభిప్రాయపడ్డారు.
తాను హౌస్ లో ఉంటే.. తానే విన్న‌ర్ కావాల‌ని కోరుకునే వాడిన‌ని చెప్పింది. విశ్వ టాస్క్‌లు బాగా ఆడుతారని చెప్పారు. అంద‌రితో స్నేహంగా ఉంటాడ‌ని తెలిపింది.

శ్వేతాలోని గుడ్ క్వాలిటీస్ గురించి చెబుతూ.. ఆమె ఎవరినీ హర్ట్ చేయదని, హర్ట్ చేస్తే వారికి క్షమాపణ చెప్పడానికి వెనకాడరని అన్నారు. అలాగే హైస్‌మేట్స్‌లో ఎవరినీ ఇన్‌ఫ్లుయన్స్ చేయడానికి ప్రయత్నించదన్నారు. త‌రువాత‌.. ప్రియ మాట తీరు న‌చ్చ‌లేద‌ని.. వయస్సు ముఖ్యంకాదు.. ఎలా మాట్లాడుతున్నామన్నముఖ్య‌మ‌ని అన్నది. ప్రియను ఎప్పుడూ అక్క‌లాగేనే భావిస్తాన‌నీ.. కానీ ఆమె మాటాలు త‌న‌ని చాలా హ‌ర్ట్ చేశాయ‌ని అన్న‌ది. ప్రియ అలా మాట్లాడేలా చేసి ర‌విపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news