పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని కౌంటర్.. పందితో సమానం అంటూ !

-

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… వైసిపి సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ టికెట్ విధానాన్ని వైసీపీ సర్కార్ తీసుకురావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో వైసీపీ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అయితే.. ఈ మాటల యుద్ధం ఇప్పుడు ట్విట్టర్‌ వార్‌ గా మారిపోయింది. తాజాగా ట్విట్టర్‌ పవన్ వర్సస్ వైసీపీ నేతలు అన్నట్లుగా మారింది. వైసీపీ నేతల వ్యాఖ్యలపై పవన్ ఘాటు విమర్శలు చేస్తూ ట్విట్ చేయగా.. పవన్ చేసిన ట్విట్ కు ఘాటుగా రీ ట్విట్ చేశారు మంత్రి పేర్ని నాని. తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమె వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ట్విట్ చేయగా… జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న’మస్కా’రాలు అంటూ అదే స్థాయిలో పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ నేతలను కుక్కలు అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్ చేయగా…
దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ పంది అంటూ రీ ట్విట్ చేశారు మంత్రి పేర్ని నాని. అంతేకాదు… పవన్ కళ్యాణ్ కు కౌంటర్ గా మరో వీడియో పోస్ట్ చేశారు మంత్రి పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news