కటింగ్, షేవింగ్ చేశారో ఇక అంతే సంగతి. ఎక్కడంటే..

కటింగ్, షేవింగ్ చేశారో ఇక బార్బర్ల కు మరణమే.. ఇది ఎక్కడో కాదు ఆప్గనిస్థాన్లో. తాలిబన్లు తీసుకువచ్చిన మరోక ఆటవిక నిర్ణయం. ఆప్గనిస్థాన్ ను స్వాధీనం చేసుకన్న తర్వాత తాలిబన్లు షరియా చట్టాన్ని అమలు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బార్బర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కటింగ్, షేవింగ్ చేశారో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేశారు. తాజాగా ఆప్గాన్లోని హెల్మండ్ ప్రావిన్స్ లో ఈ తరహా ఆదేశాలు జారీ చేశారు. మగవాళ్లు గడ్డాలు తీసుకోవడం ఇస్లాంకు విరుద్ధమని అలా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. గతంలో అమెరికన్ సైన్యం ఆప్గాన్లో ప్రభు

త్వం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి యువత అమెరికన్ తరహా హెర్ స్టైళ్లకు అట్రాక్ట్ అయ్యారు. ప్రస్తుతం వీరు ఆప్గాన్ నుంచి వైదొలిన తర్వాత మగవాళ్లు కచ్చితంగా గడ్డాలు పెంచాలని తాలిబన్లు ఆదేశిస్తున్నారు. మహిళలు కూడా సౌందర్య సాధనాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.