Jayasudha VS Balu : నేనూ పొట్టిబట్టలేశా కాని.. ఇలా!! బాలు కామెంట్స్‌పై జయసుధ రియాక్షన్

-

హీరోయిన్స్ సినిమా ఫంక్షన్స్ కు పొట్టి దుస్తులు వేసుకోవడంపై సీరియస్ అయిన ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాటలకు రెస్పాండ్ అవుతూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. బూజుపట్టిన సంప్రదాయ ముసుగులో నుండి బయటకు రావాలని.. ఆడవాళ్లు వాళ్లకు ఇష్టమొచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు ఉందని దాని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని అన్నారు నాగబాబు.

అయితే బాల సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు ఒకప్పటి హీరోయిన్ జయసుధ స్పందించారు. బాల సుబ్రహ్మణ్యం మాట్లాడింది కరెక్ట్ అని.. తాను కూడా సినిమాల్లో పొట్టి డ్రెస్సులలో కనిపించానని.. కాని సినిమా వేడుకలకు పద్ధతిగా వచ్చానని.. ఇప్పుడు హీరోయిన్స్ వేల మంది వచ్చే సినిమా వేడుకలకు చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ వస్తున్నారని అన్నారు జయసుధ. బాలుకి సపోర్ట్ చేసింది అంటే నాగబాబు కామెంట్స్ ను జయసుధ వ్యతిరేకించినట్టే.. దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news