ఫిల్మ్ నగర్ లో విషాదం..జూనియర్ ఆర్టిస్ట్ సూసైడ్..!

-

పెళ్లి చేసుకుంటానని ఓ జూనియర్ ఆర్టిస్ట్ ను నమ్మించి ఆరేళ్లుగా సహజీవనం చేసిన ఓ యువకుడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన హైదరాబాద్ ఫిలిం నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఫిలింనగర్లోని జ్ఞానిజైల్ సింగ్ నగర్ బస్తీలో జూనియర్ ఆర్టిస్ట్ కావాలి అనురాధ, కిరణ్ అనే యువకుడితో ఆరేళ్లుగా ఒక గది అద్దెకి తీసుకుని సహజీవనం చేస్తోంది.

కిరణ్ అనురాధ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆరేళ్లుగా ఆమెతోనే ఉంటున్నాడు అయితే కిరణ్ చెప్పకుండా మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం కాస్త అనురాధా సోదరి తెలిసింది ఈ విషయాన్ని అనురాధ చెప్పడంతో కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైంది ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అనురాధ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news