సహజంగా సర్జరీ సమయంలో పేషంట్లు కాస్త కంగారు, ఆందోళనకు గురవ్వడం సహజం. కొంత మంది చిన్న సర్జరీలకు కూడా భావోద్వేగాలు అపుకోలేరు. కంగారుతో ఏడుస్తారు. అటువంటి సమయాల్లో పేషెంట్లకి ధైర్యం చెప్పి వారిని ఏం కాదని భరోసా ఇచ్చి మామూలు స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉంటుంది. అంతే కానీ ఆపరేషన్ సమయంలో ఏడ్చిందని ఎవరైనా బిల్లు వేస్తరా.? అయితే వింత బిల్లునే అమెరికాలో ఓ ఆస్పత్రి పేషంట్కు పంపింది. ఊహించని బిల్లుతో షాక్ తిన్నసదరు మహిళ దాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో మిడ్జ్ పేరతో ఉన్న ఓ మహిళ హస్పిటల్ బిల్లును షేర్ చేసింది. ఇన్వాయిస్లో బ్రీప్ ఎమోషన్ పేరుతో 11 డాలర్లను బిల్లు వేసింది. ఈ ఘటన అమెరికన్ ఆరోగ్య వ్యవస్థలో పెద్ద దుమారానికి దారి తీసింది. సదరు మహిళ చేసిన ట్వట్ కు 1.07 కోట్ల లైకులు, 8000 వేల రీ ట్విట్లు వచ్చాయి. నెటిజన్లు పలు రకాల వ్యంగాస్త్రాలతో రీ ట్విట్లు చేశారు.
సర్జరీ సమయంలో ఏడ్చినా బిల్లు వేస్తరా..అమెరికన్ ఆస్పత్రి వింత నిర్ణయం
-