MAA Election: “మా” ఎన్నికల వాడివేడీ.. ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్.

-

MAA Election: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి. రోజురోజుకు ఆస‌క్తిగా మారుతున్నాయి. ఈ జోరును చూస్తుంటే.. సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌లపిస్తున్నాయి. తాజాగా నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. మంచు విష్ణు ప్యానల్‌, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు తమ తమ నామినేషన్‌లు దాఖలు చేశారు.

ఎన్నికల తేదీ అక్టోబ‌ర్ 10 స‌మీపిస్తున్న కొద్ది ప్ర‌చారం మ‌రింత‌ జోరుగా సాగుతుంది. తొలుత సైలెంట్ గా ఉన్నా.. మంచు విష్ణు జోరు పెంచారు. స్థానికుడు, తెలుగు వాడు అనే సింపతి వ‌ర్క్ అవుట్ అయ్యేలా ఉంది. అటు ప్రకాశ్ రాజ్ సైతం తనకు మద్ధతు ఇవ్వాల్సిందిగా పెద్దలను కోరుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న ట్విట్ చేశారు. మీ ఓటే మీ గొంతు.. ‘మా’ హితమే మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం..’మా’ ఆశయాలను గెలిపిద్దామంటూ ట్వీట్ చేశారు. యువర్ ఓట్ ఈజ్ యువర్ వాయిస్ అని తెలిపారు. ‘‘మా’’ హితమే మా అభిమతమని పేర్కొన్నారు. తన ప్యానల్‌ సభ్యులతో ఉన్న పాంప్లేట్‌ ఫొటో షేర్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ని బండ్ల గణేష్ రీట్వీట్ చేస్తూ.. ” ఒకే ఒక ఓటు మాత్రం జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కి ఓటు వేయండి” అని పోస్ట్ చేసుకోచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news