ప్రేమ విఫలం..రన్నింగ్ బ‌స్ దిగి హుస్సేన్ సాగ‌ర్ లో దూకిన యువ‌కుడు..!

-

ప్రేమ విఫ‌లం అవ్వ‌డంతో ఓ యువ‌కుడు ర‌న్నింగ్ బ‌స్ నుండి దిగి నేరుగా హుస్సేన్ సాగ‌ర్ లో దూకేశాడు. అయితే అక్క‌డే ఉన్న పోలీసులు గ‌మ‌నించడంతో వెంట‌నే సాగ‌ర్ లో దూకి ఆ యువ‌కుడిని ర‌క్షించారు. వివ‌రాల్లోకి వెళితే..క‌ల‌క‌త్తాకు చెందిన 23 ఏళ్ల యువ‌కుడు మౌలాలి లో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువ‌తితో అతడు ప్రేమ‌లో ప‌డ్డాడు. అయితే అత‌డి ప్రేమ విఫ‌లం అయ్యింద‌ని యువకుడు ర‌న్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బ‌స్సు నుండి హుస్సేన్ సాగ‌ర్ రాగానే బ‌స్సు నుండి దిగి అదే వేగంతో వెళ్లి హుస్సేన్ సాగ‌ర్ లో దూకాడు.

అక్క‌డ గ‌స్తీలో ఉన్న పోలీసులు వెంట‌నే యువ‌కుడిని చూసి నీటిలో దూరి పైకి తీసుకువ‌చ్చారు. ప్ర‌స్తుతం యువ‌కుడు క్షేమంగా భ‌య‌ట‌ప‌డ్డాడు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణం ఏంట‌ని అత‌డిని ప్ర‌శ్నించ‌గా ప్రేమ విఫ‌లం అయ్యిందంటూ స‌మాధానం ఇచ్చాడు. దాంతో కుటుంబ స‌భ్యుల‌ను పిలిపించి యువ‌డికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news