తెలంగాణలో కాంగ్రెస్ కు గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా.. 2023లో కాంగ్రెస్నుఅధికారంలోకి తీసుకువచ్చేలా దిశానిర్థేశం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్లో కొత్త విశ్వాసం వచ్చింది. వరసగా ప్రజా సమస్యలపై నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో పాటు పలు పార్టీల్లోని నాయకులను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటుంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ను రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు పర్యటిస్తున్నారు. మెదక్ జిల్లాలో మండలాధ్యక్షులతో సమావేశయ్యారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ను బలోపేతం చేయాలని కార్యకర్తలను కోరారు. రానున్న 2023 ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నికల సమయంలో మానిక్కం ఠాకూర్ రాష్ట్ర పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.- టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్
-