మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి. రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ జోరును చూస్తుంటే.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. తాజాగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. మంచు విష్ణు ప్యానల్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే… తాజా గా మా అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మా ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారికంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు బండ్ల గణేష్. ” నా దైవ సమానులు నా ఆత్మీ యులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరిం చుకున్నాను. ” అంటూ బండ్ల గణేష్ తెలిపారు. అంతే కాదు… ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపుతున్నట్లు… ఆయన తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు బండ్ల గణేష్.
నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను.🙏 pic.twitter.com/PuIVkdNyDG
— BANDLA GANESH. (@ganeshbandla) October 1, 2021