కాంగ్రెస్ కు కలిసొచ్చే గ్రౌండ్.. మరో భారీ బహిరంగ సభకు సిద్దమవుతున్న హస్తం పార్టీ..

-

హస్తం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది.. ఈ క్రమంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్దమవుతున్నారు.. 19న జరిగే ఈ సభను నిర్వహించేందుకు తమకు కలిసొచ్చిన గ్రౌండ్ నే ఎన్నుకున్నారు.. ఇంతకీ ఆ గ్రౌండ్ ను కాంగ్రెస్ పార్టీ ఎందుకు సెంటిమ్మెంట్ గా మార్చుకుంది..? దాని వెనుక ఉన్న ఇంట్రస్టింగ్ విషయాలేంటో చూద్దాం..

కాకతీయులకు ఆయుపట్టుగా ఉన్న వరంగల్ ను ..కాంగ్రెస్ పార్టీ తమ సెంటిమెంట్ జిల్లాగా మార్చుకుంది.. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో ఏ కార్యక్రమం నిర్వహించినా.. సూపర్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా పడింది.దీంతో పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా.. ఈ గ్రౌండ్ నే హస్తం పార్టీ నేతలు ఎంచుకుంటారు.. 19న కూడా ఇదే గ్రౌండ్ లో సభ జరగబోతుంది..

2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక హన్మకొండలోని ఈ గ్రౌండ్ సెంటిమెంట్ ఉందని హస్తం పార్టీ నేతలు విశ్వసిస్తుంటారు.. 2003లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభ కూడా ఇక్కడే జరిగింది. ఆ సభకు సోనియాగాంధీ హాజరయ్యారు. అటు 2023లో అధికారంలోకి రావడానికి కూడా ఈ మైదానమే సెంటిమెంట్ ఉందని నేతలు చర్చించుకుంటున్నారు..

2022 మే 6వ తేదిన రైతు డిక్లరేషన్ సభ కూడా ఇక్కడే నిర్వహించారు. దీనికి ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని అదేవిధంగా రైతులకు సంబంధించి కొన్ని వరాలు ఇక్కడి నుంచే ప్రకటించారు.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.. ఈ గ్రౌండ్ లో నిర్వహించడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేతలే నమ్ముతున్నారు.. మొదటి విడత రుణమాఫీ జరిగిన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ స్థలంలోనే పుష్పాభిషేకం, సంబరాలు కూడా జరుపుకున్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. డిసెంబర్ 7వ తేదీ నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ నేపద్యంలో వరంగల్ సెంటిమెంట్ ను మరోసారి వర్కౌట్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ మైదానంగా భావిస్తున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోనే ఇప్పుడు ఏడాది పాలన విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news