ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021-22సంవత్సరానికి గాను నూతన మద్యం పాలసీని ప్రకటించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న రిటైల్ ఔట్ లెట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. అలాగే, జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇంకా మద్యం క్రయ విక్రయాల్లో పారదర్శకత పాటించనున్నట్లు స్పష్టం చేసింది.
అదీగాక ఇకపై మద్యం విక్రయాలకు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. పర్యాటక సౌకర్యాలు అందించే కేంద్రాల్లో మద్యం అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ విధానాలను నూతన మద్యం పాలసీలో పొందుపర్చింది. వాకిన్ స్టోర్ల ఏర్పాటుకు బేవరేజెస్ కార్పోరేషన్ కు అనుమతులు మంజూరు చేసింది.