చౌక ధరకే ఇల్లు, ప్రాపర్టీ, స్థలం ఇలా కొనేయండి..!

-

మీరు ఇల్లుని కొని సొంతింటి కలని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా…? లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చెయ్యాలి అని భావిస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మీ కోసం అదిరే ఆఫర్లు వున్నాయి. ఈ ఆఫర్ ని వినియోగించుకుని మీరు కొనుగోలు చేస్తే చాలా డబ్బులని ఆదా చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. బ్యాంక్ తక్కువ ధరకే ఇల్లు, ఇతర ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

ఇదే వీటిని కొనుగోలు చెయ్యడానికి మంచి సమయం. దీని ద్వారా మీరు కొనుగోలు చేస్తే తక్కువ ధరకే వచ్చేస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇ-వేలం నిర్వహిస్తోంది. అయితే ఇది అక్టోబర్ 8న ఉంటుంది. ఇక ఈ ఇ-వేలం వివరాలని చూస్తే.. ఇ-వేలంలో భాగంగా బ్యాంక్ ఇల్లు, స్థలం, ప్రాపర్టీ వంటి వాటిని విక్రయానికి ఉంచనుంది.

ఈ వేలంలో పాల్గొని తక్కువ ధరకే ఇల్లు లేదా ఇతర ప్రాపర్టీలను సొంతం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే హౌసింగ్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీలను వేలం వేస్తారు. ఇల్లు, షాపు, ప్లాట్ వంటి వాటిని తక్కువ ధరకే పొందొచ్చు. ఈ విషయాన్ని బరోడా బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. అక్టోబర్ 8 వేలంలో మీకు నచ్చిన ప్రాపర్టీని కొనొచ్చని బ్యాంక్ అంది. మీరు కొనుగోలు చెయ్యాలని అనుకుంటే బ్యాంక్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news