ప్రధాని మోడీకి సొంత పార్టీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చాడు. త్రిపురలో బిజెపి ఎమ్మెల్యే ఆశిష్ దాస్ బిజెపి పై విమర్శలు గుప్పిస్తూ గుండు కొట్టించుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని కాళీమాత ఆలయంలో ఆశిష్ దాస్ యజ్ఞం నిర్వహించి ప్రధాని మోడీ పై విమర్శలు కురిపించారు. బిజెపి నాయకత్వంలోని త్రిపుర లో జరిగిన దుష్టపాలన తనను కలచివేసిందని అన్నారు. అందువల్లే గత రెండేళ్లుగా ప్రభుత్వం చేసిన తప్పుడు పనులను అన్నింటినీ విమర్శిస్తున్నారని చెప్పారు.
పార్టీకి రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం తాను పని చేస్తున్నా అని వెల్లడించారు. బిజెపి దుర్మార్గపు పాలనకు నిరసనగా తాను గుండు కొట్టించుకున్నా అని చెప్పి గుండు గీయించుకున్నారు. ఇదిలా ఉంటే ఆశిష్ దాస్ గత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా 2024 లో ప్రధాని మోడీ కి మమతా బెనర్జీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుందని ఆశిష్ దాస్ పేర్కొన్నారు.