మోహ‌న్ బాబును రాజ‌శేఖ‌ర్ క‌లిసింది అందుకే..జీవిత క్లారిటీ..!

-

ఇటీవ‌ల మంచు విష్ణు మా ఎన్నిక‌ల సంధ‌ర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..హీరో రాజ‌శేఖ‌ర్ త‌మ ఇంటికి వ‌చ్చి త‌న తండ్రి మోహ‌న్ బాబును క‌లిసార‌ని చెప్పారు. ఆయ‌న ఏం మాట్లాడారో చెప్పాలా అనేలోపే న‌రేష్ ఆపేశారు. దాంతో మంచు విష్ణు ఏదో సీక్రెట్ బ‌య‌ట‌పెడ‌తార‌ని అంతా అనుకున్నారు. ఓ ఇంట‌ర్య్వూలో కూడా మంచువిష్ణు ఈ విష‌యం పై ప్ర‌శ్నించ‌గా అప్పుడు కోపంలో అన్నాన‌ని ఆ విష‌యం గురించి మాట్లాడ‌ను అని చెప్పారు. దాంతో ఆ విష‌యం ఏంట‌న్న‌ది మరింత ఆస‌క్తి నెల‌కొంది. కాగా తాజాగా ఈ విష‌యంపై జీవిత స్పందించారు.

ఓటు వేయ‌కండి అని తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు న‌రేష్ త‌న‌ను స‌స్పెండ్ చేస్తా అని చెప్పార‌ని…ఏ త‌ప్పు చేయ‌కుండా ఎలా స‌స్పెండ్ చేస్తార‌ని జీవిత ప్ర‌శ్నించారు. ఇక రాజ‌శేఖ‌ర్ మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లింది నిజ‌మేన‌ని ఇండ‌స్ట్రీలో చిరంజీవి మోహ‌న్ బాబు మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తుంద‌ని అనుకుంటున్నార‌ని అది స‌ద్దుమ‌నిగేలా చూడాల‌ని రాజ‌శేఖ‌ర్ వెళ్లి కోరిన‌ట్టు జీవిత వెల్ల‌డించారు. అంతే కాకుండా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న వివాదాల‌పై మోహ‌న్ బాబు తో రాజ‌శేఖ‌ర్ చ‌ర్చించార‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news