ప్రతిపక్షం, పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆత్మకత ఉనిక పుస్తకాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. విద్యా సాగర్ రావుని తామంతా సాగర్ జీ అని పిలుచుకుంటామని తెలిపారు. ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి తన స్వీయ చరిత్ర రాసుకోవడం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు.
తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలకు ఒకేసారి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారంటే ాయన సామర్థ్యం ఏంటో ప్రధాని మోడీ కూడా గుర్తించారని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షం.. పాలక పక్షం కలిసి పని చేసేది అని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రతిపక్స సభ్యులను సభ నుంచి బహిష్కరించలేదని.. 13 నెలల కాలంలోనే ఇదే చేస్తున్నామని తెలిపారు. విద్యాసాగర్ రావు మొదలు పెట్టిన గోదావరి జలాల వినియోగం ఆలోచన సంపూర్ణంగా పూర్తి కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.