Maa Elections 2021: జూ.ఎన్టీఆర్‌కు రాజీవ్‌ కనకాల రిక్వెస్ట్ ! మ‌రి ఆ ప‌ని చేసేనా?

-

Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తుది ప‌ర్వానికి చేరింది. గతంలో ఎన్నాడు లేని విధంగా ఈసారి నువ్వా.. నేనా అంటూ సాగుతున్నాయి. మా అధ్య‌క్ష‌ పోటీలో నిలిచిన అభ్యర్థులు అభ్యర్థులు పోటా పోటీగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. వారి మ‌ద్ద‌తుదారులు కూడా ప్ర‌చార ఘ‌ట్టాన్ని విమర్శలు, వివాదాలు, తీవ్ర ఆరోపణల‌తో ర‌క్తిక‌ట్టించారు. అయితే.. ఈ వ్య‌వ‌హ‌రం కొంద‌రూ సినీ ప్ర‌ముఖ‌లకు , ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు నచ్చలేదు.

ఈ రాద్దాంత‌మేంటి అని ప్ర‌శ్నించినా వారు కొంద‌రూ కాగా, ఆ ఎన్నిక‌ల జోలే వ‌ద్దనుకున్న‌వారు కొంద‌రూ.. వారిలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఒక్క‌రూ. అస‌లు మా ఎన్నికల్లో ఓటు వేయాల‌నుకోవ‌డం లేద‌ని ప్రకటించారు. ఇటీవల నటి జీవిత రాజ‌శేఖ‌ర్‌ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు అడగొద్దన్నాడని పేర్కొంది. ఈ వ్యాఖ్య‌లు .. ఇండ‌స్ట్రీలో చర్చనీయాంశంగా మారిన తరుణంతో నటుడు రాజీవ్ కనకాల స్పందించారు.

‘తారక్‌తో జీవిత గారు ఏం మాట్లాడారో నాకు తెలీదు. తార‌క్ ఏం చెప్పారో కూడా తెలీదు. ఆ మ్యాట‌ర్ టోట‌ల్ గా తెలియ‌కుండా నేను సమాధానం చెప్పలేను. కానీ, మా ఎన్నిక‌ల్లో అసోసియేషన్‌ సభ్యులందరూ తప్పకుండా ఓటుహ‌క్కు వినియోగించుకోవాలి. తారక్‌తో కూడా మాట్లాతాను’ అని రాజీవ్‌ అన్నారు. సినీ పరిశ్రమలో జూ.ఎన్టీఆర్, రాజీవ్ కనకాల అత్యంత సన్నిహితులన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. మా ఎన్నికల పోలింగ్‌ ప్రారంభయింది. నగరంలోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని మూడో తరగతి గదుల్లో పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఉద‌యం 8 గంట‌ల‌కే పోలింగ్ ప్రారంభ‌మైన ఈ ఎన్నిక‌లు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు. ఎన్నికల్లో 10 పేజీలతో కూడిన బ్యాలెట్‌ పేపర్లు వినియోగిస్తున్నారు. మా ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించ‌టం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news