రేపే సీఎం జగన్‌ తిరుమల పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

రేపు సీఎం జగన్ తిరుమలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన లో భాగంగా… రేపు మధ్యహ్నం తిరుపతికి చేరుకోనున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం 3 గంటలకు 25 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల హస్పిటల్ ను ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. అలాగే… సాయంత్రం 4 గంటలకు 25 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మత్తులు చేసిన అలిపిరి నడకమార్గం ప్రారంభిస్తారు.

సాయంత్రం 4:10 నిమిషాలకు 13 కోట్ల రూపాయల వ్యయంతో అలిపిరి వద్ద నిర్మించిన గో మందిరం ప్రారంభిస్తారు సీఎం జగన్‌. ఇక రేపు సాయంత్రం 5 గంటల సమయంలో తిరుమల చేరుకోనున్న సీఎం జగన్…  6 గంటలకు బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి… శ్రీవారికి పట్టు వస్ర్తాలను సమర్పించనున్నారు. రాత్రి 7:30 గంటలకు గరుడ వాహన సేవలో పాల్గొనున్న సీఎం జగన్‌… 12వ తేది ఉదయం కర్నాటక సీఎం బోమ్మైతో కలసి యస్వీబిసి కన్నడ, హిందీ చానల్స్ ప్రారంభించనున్నారు.  అలాగే.. రూ. 12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బూందీ పోటును ప్రారంభించనున్నారు.