’మా‘ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోటాపోటీ మాటలతో మా పోలింగ్ ఉద్రిక్తత వాతావరణంలో సాగుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈసారి ఎక్కువ మంది నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా ఓటుహక్కును వినియోగించుకున్న నటుడు ఆర్. నారాయణ మూర్తి తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తెలుగు నటీనటులకు రిజర్వేషన్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు నటీనటులకు అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఎవరు నెగ్గినా అందరికి న్యాయం చేయాలని కోరారు. బిజినెస్ పరంగా పాన్ ఇండియా మూవీల కోసం ఇతర రాష్ట్రాల నటులను పెట్టకుంటున్నారని అన్నారు. పూరి జగన్నాథ్ లైగర్ మూవీ కోసం మైక్ టైసన్ ను పెట్టుకున్నారని నారాయణ మూర్తి గుర్తు చేశారు.