పవన్‌ కళ్యాణ్ కు పూనమ్‌ కౌర్‌ చురకలు : మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు !

మా అసోషియేషన్‌ ఎన్నికల పోలింగ్‌ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి పోలింగ్‌ శాతం కూడా పెరుగుతోంది. చాలా మంది నటీ నటులు మా అసోషియేషన్‌ ఎన్నికల పోలింగ్‌ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యం లో ఓటు వేసేందుకు నటి పూనమ్‌ కౌర్‌… పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు పూనమ్‌ కౌర్‌. మా అసోషియేషన్‌ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌ కి తాను సపోర్ట్ చేసానని.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నానని తెలిపారు.

ప్రకాష్ రాజ్ గెలిస్తే.. అందరూ నటీ, నటులకు బాగుంటుందని చెప్పారు పూనమ్ కౌర్. అంతేకాదు.. కొందరూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని… తమ అవసరాల కోసం.. నటీ నటులను.. పాలిటిక్స్‌ లోకి లాగొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ప్యానెల్‌ గెలిచినా.. రాజకీయ గొడల్లోకి వెళ్లకుండా.. మా అభివృద్ధికి పాల్పడాలని కోరారు పూనమ్‌ కౌర్‌. అయితే… పూనమ్‌ కౌర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు.. పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశించి అన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. కాగా.. పూనమ్‌ కౌర్‌ ను పవన్‌ కళ్యాణ్‌ మోసం చేశాడని పోసానీ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే.