నగరవాసులకు అలర్ట్..ఊరెళితే చెప్పి వెళ్ళండి..!

-

ట్రాన్స్ఫార్మర్స్ లోని కాపర్ వైర్స్ దొంగతనాలు చేస్తున్న ముఠాను న‌గ‌ర పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీసీఎస్, కందకురు పోలీసులు, ఎల్బీనగర్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వ‌హించి ముఠాను ప‌ట్టుకున్నారు. ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి మొత్తం 25 లక్షల 6 వేల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 18 లక్షల నగదు, 160 కిలోల ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ వైర్, నాలుగు బైక్స్, ఒక కార్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నందు లాల్ రాజ్ బర్, అభిమాన్య రాజ్ బర్ ఇద్దరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

మ‌రో ఇద్ద‌రు నింధితులు సహదేవ్, రాహుల్ రాజ్ బర్ పరారీలో ఉన్నారు. నింధితుల‌ను ప‌ట్టుకున్న పోలీసుల‌కు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ రివార్డులు ఇచ్చారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ…దసరా పండగ కు ఉరేళ్లేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల‌ని అన్నారు. ఉరెళ్లేవాళ్లు చుట్టుపక్కల వారికి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇతర రాష్టాల కు చెందిన వారు దొంగతనాలకు పాల్పడుతారని అన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా చూడాలని చెప్పారు. బంగారం , క్యాష్ ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లాకార్ల లో ఉంచుకోవాలని సూచించారు.
ఇంట్లో కెమెరాలు ఉన్నవారు వాటిని పనిచేసే విదంగా చూడాలని..ఎలాంటి అనుమానాలు వచ్చిన వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news