హుజూరాబాద్ బైపోల్ బరిలో 30 మంది అభ్యర్థులు

హుజూరాబాద్ బైపోల్ లో ఎంతమంది పోటీలో ఉంటున్నారనే లెక్క తేలింది. తాజాగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం హూజూారాబాద్ ఎన్నికల్లో 30 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్లు ప్రారంభమైన తర్వాత మొత్తంగా 61 మంది నామినేషన్లు దాఖలు చేస్తే ప్రస్తుతం నామినేషన్ల తిరస్కరణ, విత్ డ్రాల అనంతరం 30 మంది చివరగా పోటీలో ఉన్నారు. చివరి రోజు 12 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. పోటిలో నిల్చున్న స్వతంత్రులకు సాయంత్రం లోగా గుర్తులు కేటాయించనున్నారు. 

ఎన్నికల్లో రెండు ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే రోడ్డు రోలర్, ఆటో గుర్తులపై సందిగ్థం నెలకొంది. గత ఎన్నికల్లో ఈ గుర్తుల వల్ల టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. రోడ్డు రోలర్, ఆటో గుర్తులు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలి ఉండటంతో పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. గతంలో ఈ వివాదంపై టీఆర్ఎస్ పార్టీ ఈసీని కూడా కలిసింది. అయితే ప్రస్తుతం ఈ రెండు గుర్తులకు కేటాయించాలంటూ పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల అధికారులను కోరుతున్నారు. ఈనెల 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ ఉండనుంది.