భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ కు ఆరోగ్యం ఒక్క సారిగా క్షీణించింది. ఆయన పరిస్థితి విషమించడంతో దేశ రాజధాని ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆస్పత్రి లో చేర్చారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ కు ఎయిమ్స్ వైద్యులు ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఇక ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఆయన కు శ్వాస సమస్యలతో పాటు చెస్ట్ పెయిన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. రేపు ఉదయం మరోసారి ఆయన హెల్త్ బులిటెన్ ను విడుదల చేయనుంది ఎయిమ్స్ వైద్యుల బృందం. కాగా.. యూపీఏ హాయాం లో రెండు సార్లు ప్రధాన మంత్రి గా.. మన్మోహన్ సింగ్ పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా సేవలు అందిస్తు న్నారు.