కరోనా కాటు..కోటి పెట్టినా దక్కని ప్రాణం..!

-

కరోనా మహమ్మారి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. కరోనా ఫస్ట్ వేవ్..సెకండ్ వేవ్ రూపంలో వచ్చి ప్రాణాలను హరించివేసింది. అయితే ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. అయితే గతం లో కంటే మరణాలు కేసులు తక్కువ నమోదు అవుతున్నా సైలెంట్ కిల్లర్ లా కరోనా దాడి చేస్తోంది. ఓ వ్యక్తి కరోనా బారిన పడగా చికిత్స కోసం కోటి ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. దాంతో కొడుకు ను ఆస్తిని కోల్పోయి ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది.

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పరెడ్డి గూడానికి చెందిన సత్యనారాయణ అనే రైతు(37) జూలై లో ఓ శుభ కార్యానికి వెళ్లి వస్తూ కరోనా భారిన పడ్డాడు. అతడు శ్వాస ఇబ్బందుల తో ఖమ్మం లో చికిత్స తీసుకున్నాడు. ఆతరవాత హైదరాబాద్ కు తరలించారు. అతడి ఊపిరితిత్తులు క్షీనించగా రోజుకు రూ. 1.80లక్షలు ఖర్చయ్యేది. ఒకే కొడుకు కావడం తో తల్లి తండ్రులు పొలం అమ్మి చికిత్సకు పెట్టారు. కానీ ఆ వ్యక్తి ప్రాణం మాత్రం దక్కలేదు.

Read more RELATED
Recommended to you

Latest news