ప్రియుడితో గొడవ..కొద్దిసేపటికే శవమై కనిపించిన యువతి..అసలేం జరిగింది..?

అప్పటివరకు ప్రియుడి తో కలిసి తిరిగిన యువతి కొద్దిసేపటికే శవమై కనిపించింది. దాంతో ప్రియుడే హత్య చేశాడా ..? లేదంటే తానే ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా భావనపాడు లో చోటు చేసుకుంది. భావనపాడు తీరంలో అనుమానస్పదంగా ఓ యువతి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ యువతిని ఒడిస్సా రాష్ట్రం పర్లాకిమిడి దరి భావీడీగాము గ్రామానికి చెందిన సిరి వరపు వృచిత గా పోలీసులు గుర్తించారు.crime

యువతి మృతి పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ప్రేమ జంట తీర పరిసర ప్రాంతాల్లో మృతురాలు సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రేమికుల మధ్య గొడవ జరిగి ఆత్మహత్య చేసుకుందా లేక ప్రియుడే హత్య చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో నౌపడ పోలీసులు విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు.