తాను తలచుకుంటే ఎవ్వరూ బయట తిరగలేరని.. అందరూ జైలుకే అని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను పోలీస్ రాజ్యం నడపను. రేవంత్ అనే పదం కొందరికీ లైఫ్ లైన్ గా మారింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. అది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో తెలియదు. నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు చెబుతాం. బీజేపీ నేతల మాటల్లోనే భయం కనిపిస్తోంది. నేను పాలన పై దృష్టి పెడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు’ అని ఫైర్ అయ్యారు.
తాను బరాబర్ గుర్తింపు మేస్త్రినే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ లా చిల్లర పనులు చేయను. నా కూతురికి పెళ్లికి నన్ను కేసీఆర్ జైలులో పెడితే.. ఆయన కూతురు కవిత ఇప్పుడు జైలులో ఉంది. కేసీఆర్ లా నేను పోలీసులను వాడను. ఆయన సలహాలు ఇస్తానంటే ఇంటికి వెళ్లి కలుస్తాను. పదేళ్లు సీఎం పదవీ మాదే.. ఏ ఎమ్మెల్యేను పార్టీలోకి రావాలని నేను కోరలేదు. వారే స్వయంగా పార్టీలోకి వచ్చారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.