ఆకట్టుకుంటున్న బాక్ ట్రైలర్

-

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి వస్తోన్న నాలుగో చిత్రం ‘అరణ్మనై 4’. ఈ చిత్రం తెలుగులో ‘బాక్’ పేరుతో మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, కోవై సరళ, శ్రీనివాసరెడ్డి తదితర నటీనటులతో రూపొందింది ఈ చిత్రం.

తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. బాక్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హిప్ హాప్ తమిళా సంగీతం అందించారు. మే 03న థియేటర్లలోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news