బ్రేకింగ్ : సీరియల్ నటి కన్నుమూత..!

-

బుల్లితెరపై విషాదం నెలకొంది. తమిళ బుల్లితెర నటి ఉమామహేశ్వరి అనారోగ్యంతో కన్నుమూసింది. గత కొద్ది రోజులుగా ఉమామహేశ్వరి అనారోగ్యంతో బాధపడుతోంది. కాగా ఆదివారం పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె కన్నుమూశారు. ఉమా మహేశ్వరి మొట్టి ఓలి అనే సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతేకాకుండా ఒరు కథై యిన్ కతై, మంజల్ మహిమై లాంటి సీరియల్స్ తో నూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలీ అర్జన్, వెట్టిచాకిరి ,పొడి కట్టు లాంటి సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు. ఇదిలా ఉంటే ఉమామహేశ్వరి పశు వైద్యుడుని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె నటనకు గుడ్బై చెప్పారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఉమామహేశ్వరి ఆదివారం కన్నుమూసారు. దాంతో బుల్లితెర నటీనటులు పలువురు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news