ఆయుర్వేద పద్ధతులు బాగా పని చేస్తాయి. వీటిని ఫాలో అవ్వడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. సాధారణంగా ఏదైనా సమస్య కలిగితే చాలా మంది క్రీములు మరియు మొదలైన కెమికల్ ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి కెమికల్స్ తో తయారు చేసిన వాటిని ఉపయోగించడం వల్ల సమస్యలు వస్తాయి.
అందుకని అలాంటివి ఉపయోగించడం మంచిది కాదు. వాటికి బదులుగా ఆయుర్వేద పద్ధతుల్ని పాటిస్తే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇబ్బందులు తొలగించుకోవచ్చు. అయితే ఈ రోజు మరి కొన్ని సమస్యలుని తరిమికొట్టే ఆయుర్వేద చిట్కాలు గురించి చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
జుట్టు సమస్యలని తొలగించే పద్ధతులు:
మందారం:
మందార పువ్వు మరియు ఆకులు కూడా జుట్టు సమస్యలను తొలగిస్తాయి. జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జుట్టుని నల్లగా మార్చడానికి, బట్టతల వంటి సమస్యలు తొలగించడానికి మందార పువ్వులు ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే చుండ్రుని కూడా తగ్గిస్తుంది. మీరు మందారంని పేస్ట్ కింద చేసి తలకి పట్టిస్తే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు లేదా మందార నూనె కూడా వాడొచ్చు.
ఉసిరి:
ఉసిరిలో కూడా ఆయుర్వేద గుణాలు ఉంటాయి పైగా పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. ఇది కూడా జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలానే జుట్టు పొడిబారి పోయినా కూడా ఇది తగ్గిస్తుంది. ఇలా ఉసిరిని కూడా మనం ఉపయోగించవచ్చు. ఉసిరిపొడి లేదా ఉసిరికాయలతో స్వయంగా మనమే ప్యాక్ కానీ నూనె కాని చేసుకోవచ్చు.
మెంతులు:
మెంతులు లో కూడా ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయి. చుండ్రు, జుట్టు రాలిపోవడం మొదలైన సమస్యలకు చెక్ పెడుతుంది ఇది. మెంతి పొడిని జుట్టుకు పట్టిస్తే అద్భుతమైన ప్రయోజనాలు పొంది జుట్టు సమస్యలకు దూరంగా ఉండొచ్చు.