మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దేశ వ్యాప్తంగా మొత్తం 3261 ఉద్యోగ పోస్టులు భర్తీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఫేజ్ 9 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకి చివరి తేదీ 2021 అక్టోబర్ 25. ఇందులో జనరల్ కోటా లో 1366 పోస్టులు, ఎస్సీ కోటా లో 477 పోస్టులు, ఎస్టీ కోటా లో 249 పోస్టులు, ఓబీసీ కోటా లో 788 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కోటా లో 381 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు కనీస వయస్సు 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ 2021 అక్టోబర్ 28. ఫిబ్రవరిలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 10+2, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చెయ్యచ్చు. దరఖాస్తు ఫీజు వచ్చేసి రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు వుంది. పూర్తి వివరాలని https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/notice_rhq_24092021.pdf లో చూడచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.