మన దేశంలో పెట్రోల్ ధరలు మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. రోజు రోజు పెట్రోల్ ధరలు పెరగడమే తప్ప ఏనాడూ తగిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అదనపు టాక్స్ ల కారణంగా… దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే… పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో కర్ణాటక సర్కార్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన తర్వాత, పెట్రోల్‌పై పన్నులు తగ్గించే విషయం నిర్ణయిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై చర్చించామని, మరోసారి కేబినెట్‌లో తీర్మానిస్తామని తెలిపారు. సిందగి, హానగల్ అసెం బ్లీ నియోజక వర్గాలకు ఈనెల 30న ఉప ఎన్నికలు జరుగనున్న కారణంగా సీఎం బస్వరాజు బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు.