Rashmika Mandanna: “స్వశక్తిని నమ్ముకో.. అప్ప‌డే నీ జీవితానికి నువ్వే యజమానివి”.. రష్మిక మందన పోస్ట్ వైర‌ల్.. అస‌లు ఏమైంది?

-

Rashmika Mandanna: “ఛ‌లో” మూవీతో తెలుగు తెర‌పైకి అడుగుపెట్టిన క‌న్న‌డ భామ రష్మిక మందన. అన‌తికాలంలోనే త‌నదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మదిలో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకుంది. వ‌రుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. డేరింగ్ అండ్ డాషింగ్ కామెంట్స్ చేస్తూ.. అంద‌రి దృష్టిలో ఆక‌ర్షిస్తుంది.

ఆమె స్టేట్ మెంట్లు చాలా సార్లు కాంట్రవర్సీగా మారాయి. సోషల్ మీడియాలోనూ ఆమె ట్రోలింగ్ ఎదుర్కొన్నది. అయినా ఆమె ఆ అలవాటు మానుకోలేదు. ఇలా మాటల తూటాలు పేల్చి కాంట్రవర్సీ క్వీన్ గా మారింది.

తాజాగా ఈ అమ్మ‌డు.. కాస్తా డిఫిరెంట్ గా ఫిలాస‌పీ చెప్తు.. ఇన్స్‌స్టాగ్రామ్‌లో వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టింది. “నీ జీవితానికి నువ్వే యజమాని. నీలో ఉన్న దాగి ఉన్నప్రతిభను గుర్తించగలిగితే జీవితంలో మరింత ముందుకు వెళ్తాం.. ఓ మనిషిగా మనం లోపాలతో జన్మించి ఉండొచ్చు. అభద్రతాభావాల మధ్య జీవిస్తూ ఉండొచ్చు. కానీ ప్రపంచం నువ్వు ఏం చేయగలవని అనుకుంటుందో దానికన్నా ఎక్కువగానే సాధించగలవని తెలుసుకునే సమయం వస్తుంది. అది గ్రహించినప్పుడు నువ్వు తిరుగులేని వాడవవుతావు’. అంటూ వ‌రుస పోస్టు చేసింది.

“స్వశక్తిని నమ్ముకోవాలి. నీ జీవితానికి, నీ భావోద్వేగాలకు నువ్వే యజమానివి అనేది ఫైనల్” అంటూ రాసుకొచ్చింది. ఉన్న‌ట్టుంది ర‌ష్మిక ఈ పోస్ట్ ఎందుకు పెట్టింది ? రష్మిక పోస్ట్ వెనుక అస‌లు కార‌ణ‌మేంటీ? గత జ్ఞాపకాలు తలచుకొని ఇలా పోస్ట్ పెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నెట్టింట్లో చ‌ర్చ న‌డుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news