BiggBoss 5 Telugu : ‘చెంప పగిలిద్ది’ అంటూ రెచ్చిపోయిన ప్రియా.. అస‌లేం జ‌రుగుతోంది!

-

BiggBoss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 చాలా రసవత్తరంగా సాగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా
బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న రియాలిటీ షో గా కొనసాగుతోంది. బుల్లితెర ప్రేక్షకుల క‌న్ను బిగ్ బాస్ షో పై ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ షోలో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు మరింత రసవత్తరంగా మరింత కాంట్రవర్షియల్ గా మారిపోయింది అని చెప్పాలి. హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఒక రేంజ్ లో ఉంటున్నాయ్. అయితే గత సీజన్ లో కంటెస్టెంట్స్ ఎప్పుడూ కూడా పరుష పదజాలాన్ని వాడలేదు. మ‌రోవైపు.. షో నుంచి ఒక్క‌రూగా ఎలిమినేట్ అవుతుంటే.. ఉత్కంఠ పెరిగిపోతుంది. తాజాగా అక్టోబర్ 20 నాటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది.

అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రియా సన్నీ ని నామినేట్ చేసింది. ఈ క్ర‌మంలో చాలా సిల్లీ రీజ‌న్ చేప్పింది. దీంతో గొడ‌వ ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన టాస్కులో
ప్రియా.. సన్నీ ని టార్గెట్ చేస్తూ ఆడుతుంది. దీంతో బిగ్ బాస్ హౌస్ వాడివేడిగా మారిపోయింది.
ఇంటి సభ్యులంతా కోడి నుంచి గుడ్లు సేకరించే పనిలో ఉంటారు. వారు పొందిన గుడ్లని బుట్టలో దోచుకుంటుంటారు. అలాగే ప్రియ కూడా స‌న్నీ గుడ్ల‌ను తీసుకునే ప్రయత్నం చేసింది.

సాధారణంగానే.. స‌న్నీ చాలా అగ్రెసివ్ .. ఇక తాను సంపాదించుకున్న గుడ్లను ప్రియా దొంగలిస్తుంటే..
మరింత సీరియస్ అయ్యాడు. ప్రియను పక్కకు నెట్టేశాడు. దాంతో ఆగ్ర‌హానికి లొనైనా ప్రియ‌..
చెంప పగిలిపోద్ది అంటూ మండిపడింది. స‌న్నీ కూడా ఏ మాత్రం త‌గ్గ‌లేదు.. నోరు ఉంది కదా అని పారేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చాడు. అంతటితో ఈ గొడవ ఇంకాస్త పెద్దదైంది.

ఈక్రమంలో సన్నీ ప్రియ‌ను ఏయ్ అన్నడంతో.. ప్రియా ఏయ్ ఏంటి ఏయ్ అంటున్నావ్ అని ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. ఆ త‌ర్వ‌త స‌న్నీ చేతకాని మొహాలు వస్తారు ఇక్కడికి అనడంతో.. చెంప పగిలిపోద్ది అని ప్రియా అంది. దాంతో కోపంతో రగిలిపోయిన సన్నీ దమ్ముంటే కొట్టి చూడు అంటూ ప్రియా మీదకు వెళ్ళాడు.

ఇదిలాఉంటే.. హౌస్ లో జరిగే ఫన్నీ గేమ్ ని లోబో సీక్రెట్ రూమ్ లో ఉంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. మ‌రోవైపు జెస్సీని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి.. సీక్రెట్ టాస్క్ ఇస్తారు. కెప్టెన్సీ టాస్క్ పోటీదారుడు అయ్యేందుకు ఒక అవకాశం ఇస్తాడు. ఈ టాస్క్ ప్ర‌కారం.. హౌస్ లో ముగ్గురు సభ్యులని ఎంచుకుని వారి వద్ద ఉన్న గుడ్లను దొంగ‌లించాలని జెస్సీకి బిగ్ బాస్ చెబుతారు. అవసరమైతే ఈ సీక్రెట్ టాస్క్ లో ఒకరి హెల్ప్ తీసుకోవచ్చు అని హింట్ ఇచ్చారు బిగ్ బాస్.

దీంతో జెస్సీ రెచ్చిపోయాడు. ఈ క్ర‌మంలో సిరి స‌హాయం తీసుకున్నారు. షణ్ముఖ్, ప్రియాంక, ప్రియా లని జెస్సి టార్గెట్ చేస్తాడు. సిరి సాయంతో వారి నుంచి గుడ్లు దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. ఈ స‌మ‌యంలో జస్వంత్ సన్నీని రెచ్చిపోయేలా చేశారు. దీంతో సన్నీ జశ్వంత్ మధ్య గొడవ జరుగుతుంది. ఇక చివర్లో జశ్వంత్ కి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన విషయాన్ని బిగ్బాస్ రివీల్ చేస్తాడు. ఇప్ప‌టి ఈ సీక్రెట్ టాస్క్ తో హాట్ హాట్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news