యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విమాన గోపురానికి సర్ణ తాపడం కోసమే దాతలు బంగారాన్ని విరాళంగా ఇవ్వలేని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారీగా భక్తులు ముందుకు వస్తున్నారు. దాంతో ఇప్పటివరకు మొత్తం 36.16 కిలోల బంగారం విరాళం గా వచ్చిందని సీఎం కార్యాలయం ప్రకటించింది. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు ,ప్రముఖులు బంగారాన్ని విరాళం గా ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో లో నిన్న ఎం ఎల్ సీ చిన్నపరెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కిలో బంగారం చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించారు. అదే విధంగా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా యాదాద్రి కి కిలో బంగారం విరాళంగా ప్రకటించారు. ఇక ఏపీకి చెందిన ఓ మహిళా జెట్పీటీసీ సైతం కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది.