వాస్తు ప్రకారం దక్షిణం వైపు ఏం ఉంచాలో తెలుసా..?

-

వాస్తు గురించి కేవలం పండితులకే కాదు.. మనకు కూడా కాసింత అవగాహన ఉండాలి.. లేకపోతే ప్రతిదానికి వాళ్లను తీసుకొచ్చి చూపించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఏ దిక్కను ఏం ఉండాలి., రూమ్‌లో ఉంచుకోవాల్సిన వస్తువులు ఏంటి, ఉంచుకోకూడని వస్తువులు ఏంటి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఉత్తరంలో ఉండాలి, దక్షిణంలో ఏం ఉండాలి, ఈశాన్యంలో బరువు పెట్టొచ్చా లేదా ఇలా చాలా ఉంటాయి. వాస్తులో దక్షిణ దిక్కు గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చు. ఎలాంటి వస్తువులు తప్పనిసరిగా పెడితే సంపద చేకూరుతుంది వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..!

ఒక నిర్మాణం అందమైన ఇల్లుగా మారాలంటే మంచి ఎనర్జీతో ఉండాలి. అటువంటి ప్రదేశంలో నివసించే వారి మీద దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందనేది వాస్తు శాస్త్ర వాదన. వాస్తు శాస్త్రం ప్రస్తావించిన పరిష్కారాలు ఈ ఎనర్జీని సంతులన పరచడంలో సహకరిస్తాయి. ఎన్నో గుళ్లు, గోపురాలు, కట్టడాలు వేలాది సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా నిలిచి ఉండడానికి కారణం సరైన వాస్తు.

దక్షిణం వైపు ఇవి పెట్టుకుంటే..

  • దక్షిణం వైపు గ్రీకు పురాణాల్లో చెప్పుకునే ఫినిక్స్ పక్షి చిత్రాన్ని పెట్టుకోవడం మంచిది. ఇది సమృద్ధికి సంకేతం.
  • చీపురును ఇంట్లో దక్షిణం వైపు ఉంచాలి. అందువల్ల ఇంట్లో సంపద చేరుతుంది.
  • జేడ్ మొక్కలను కూడా ఇంట్లో దక్షిణ దిక్కున లేదా హాల్ లేదా డ్రాయింగ్ రూమ్‌లో దక్షిణం వైపు పెట్టుకోవాలట.
  • బెడ్ రూమ్‌లో మంచం దక్షిణం వైపు తల ఉండేలా అమర్చుకోవాలి. అందువల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
  • ఆగ్నేయం నిద్రకు మంచిది. ఈ దిక్కున భారీ వస్తువులు పెట్టుకోవడం మంచిది.
  • విలువైన వస్తువులు, తిజోరీ, బీరువా వంటి సంపద దాచుకునే వస్తువులను దక్షిణం వైపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
  • ఈవస్తువులు దక్షిణంలోఉంచకూడదు
  • దక్షిణం వైపు పూజ గది నిర్మించుకోవద్దు.
  • దక్షిణ దిక్కున చెప్పులు పెట్ట కూడదు. చెప్పులు పెట్టుకునే స్టాండ్ దక్షిణాన పెట్టుకోవద్దు. ఇది ఇంట్లో గొడవలకు కారణం అవుతుంది.
  • దక్షిణం వైపు పొరపాటున కూడా తులసి మొక్క పెట్టుకోవద్దు.
  • పడక గదిలో పడుకున్నపుడు పాదాలు దక్షిణం వైపు ఉండకూడదు. వైవాహిక జీవితంలో కలతలు రావచ్చు.
  • దక్షిణంలో వంట చెయ్యడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో వంట గది దక్షిణం వైపు ఉండకూడదు

Read more RELATED
Recommended to you

Latest news