రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకి గుడ్ న్యూస్. సీఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ CSIR-NEERI పలు పోస్టులని భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నా వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. హైదరాబాద్, నాగ్‌పూర్‌లో లో కూడా ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ లాంటి ఖాళీలు వున్నాయి. మొత్తం 18 పోస్టులని భర్తీ చేస్తోంది.

ఆన్లైన్ ఇంటర్వ్యూ ని నిర్వహించి అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… ప్రాజెక్ట్ అసిస్టెంట్ 10 (హైదరాబాద్), ప్రాజెక్ట్ అసోసియేట్ 3 (హైదరాబాద్), ప్రాజెక్ట్ అసోసియేట్ 5 (నాగ్‌పూర్). హైదరాబాద్‌లోని పోస్టులకు 2021 నవంబర్ 14 లోగా అప్లై చెయ్యాల్సి వుంది. అదే నాగ్‌పూర్‌లోని పోస్టులకు 2021 నవంబర్ 4 లోగా అప్లై చేసుకోవాలి గమనించండి.

ఇది ఇలా ఉంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు బాటనీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్, జియాలజీ, అగ్రి (సాయిల్ సైన్స్‌) లో బీఎస్‌సీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఎన్విరాన్‌మెంటల్, సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎంఎస్సీ పాస్ కావాలి. లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ లేదా ఎంఈ చేసి ఉండాలి.

ఇక శాలరీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు రూ.20,000 + హెచ్ఆర్ఏ, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు రూ.25,000 + హెచ్ఆర్ఏ ఇస్తారని తెలుస్తోంది. ఇక నాగ్‌పూర్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు అయితే రూ.35,000 వరకు వేతనం + హెచ్ఆర్ఏ లభిస్తుంది. https://www.neeri.res.in/ వెబ్‌సైట్‌లో ఈ పోస్టులకి అప్లై చెయ్యాలి.

హైదరాబాద్ నోటిఫికేషన్: https://www.neeri.res.in/file_homes/29182326_hzl_recruitment18102021.pdf
నాగ్‌పూర్‌ నోటిఫికేషన్:
https://www.neeri.res.in/file_homes/77501756_recruitmentemd21102021.pdf

 

 

Read more RELATED
Recommended to you

Latest news