బిగ్‌ బ్రేకింగ్‌ ; రాజేంద్ర నగర్‌ లో అదృశ్యమైన బాలుడు మృతి

రాజేంద్రనగర్ బాలుడు అనిష్‌ మిస్సింగ్ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నిన్నటి నుంచి కనిపించ కుండా పోయిన బాలుడు మృతి చెందాడు. ఇంటి వెనుక ఉన్న చెరువులో బాలుడు అనిష్‌ మృత దేహం లభ్యం అయింది.

7 ఏళ్ల బాలుడు అనీష్ డెడ్ బాడీని అక్కడే ఉన్న స్థానికులు గుర్తించినట్లు సమాచారం అందుతోంది. అనిష్‌ కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్ వెనకాల ఉన్న చెరువులో ఆ బాలుడి డెడ్ బాడీ దొరికింది. బాలుడు మృత దేహం చెరువులో తేలడంతో గుర్తించిన స్థానికులు వెంటనే బాలుడి తల్లిదండ్రులు మరియు స్థానిక రాజేంద్ర నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఈ ఘటన తెలియగానే అనిష్‌ కుటుంబం విషాదంలోకి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడు అనీష్‌ మృత దేహాన్ని పోస్ట్‌ మార్టం కు తరలించారు. ఇంట్లో వారి పట్ల మనస్థాపంతో సుసైడ్‌ చేసుకున్నారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.