ఏపీలో మరో దారుణం : మహిళా అటెండర్‌ పై సబ్‌ రిజిస్టార్‌ లైంగిక దాడి !

-

ప.గో.జిల్లాలోని ఏలూరు లో దారుణం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఘటనలో ఏలూరు సబ్ రిజిష్టార్ జయరాజు పై కేసు నమోదు నమోదైంది. రిజిస్టార్ ఆఫీస్ లో ని ఆడిట్ సెక్షన్ లో అటెండర్ గా పనిచేస్తున్న ఓ వివాహిత పై లైంగిక వేధిం పులకు పాల్పడ్డాడు సబ్ రిజిష్టార్ జయరాజు. గత కొద్ది రోజులుగా తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించారు జయ రాజు.

అయితే.. జయరాజు వేధిం పులు తట్టు కోలేక… సదరు మహిళ.. జిల్లా రిజిస్టార్ లో కూడా పిర్యాదు చేసింది. దీంతో ఆ రిజిస్టార్ జయరాజు ను మందలించారు ఉన్నతా ధికారులు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాక పోగా తన కోరిక తీర్చకపోతే ప్రాణహాని తలపెడతానని బెదిరింపులకి పాల్పడ్డాడు జయరాజు. దీంతో అధికారుల సూచనల మేరకు దిశా పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది వివాహిత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దిశా పోలీసులు‌‌..

Read more RELATED
Recommended to you

Latest news