రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తో హెచ్ ఐవీ వచ్చే ప్రమాదం ఉందని దక్షిణాఫ్రికా సంచలన ప్రకటన చేసింది. అడినోవైరస్ టైప్ 5 వెక్టార్ల కారణంగా హెచ్ ఐవీ సోకే ప్రమాదం ఉంటుందని కాబట్టి అదే వెక్టార్ తో తయారు చేసిన స్పత్నిక్ వి వ్యాక్సిన్ వేసుకుంటే ఎయిడ్స్ వస్తుందని ప్రకటించింది. ముఖ్యంగా ఈ ముప్పు పురుషులకే ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి తాము స్పత్నిక్ వి వ్యాక్సిన్ కు అనుమతులు ఇవ్వమని దక్షిణాఫ్రికా ఔషధ నియంత్రణ సంస్థ పేర్కొంది.
దక్షిణాఫ్రికా దేశ చేసిన ఆరోపణలతో నైజీరియా దేశం కూడా తమ దేశంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ లు ఇవ్వడంపై తాత్కాలిక నిషేదం విధించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు ఇచ్చే వరకూ రష్యా వ్యాక్సిన్ కు తమ దేశంలో అనుమతులు ఇవ్వమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను ఇప్పటికే కొన్ని దేశాల్లో ఇస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా చేసిన ప్రకటనతో వాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఆందోళన మొదలైంది. మరి ఆ వ్యాక్సిన్ తో హెచ్ ఐవీ వస్తుందా లేదా అన్నది డబ్ల్యూహెచ్ వో నే తేల్చాలి.